తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వైసీపీ నాయకులపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తుందని శనివారం పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా శనివారం నెల్లూరు జిల్లా కేంద్రంలో మాజీమంత్రి కాకాణిని కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇలాంటి పరిస్థితులు తాను మునుపు ఎన్నడూ చూడలేదని పెద్దిరెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.