పుంగునూరు నియోజకవర్గం లోని 6 మండలాలలో సోమవారం సాయంత్రం హఠాత్తుగా వాతావరణం లో మార్పు చోటు చేసుకుంది. ఆకాశమంతా నల్లటి మేఘాలు కమ్ముకొని మబ్బు వాతావరణం నెలకొంది. అంతేకాకుండా భారీగా ఈదురు గాలులు, ఉరుములు మెరుపులు రావడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షంతో పంటలకు మేలు జరుగుతుందని రైతన్నలు ఆశాభావం వ్యక్తం చేశారు.