చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ రోడ్డు అధ్వాన స్థితికి చేరుకోవడంతో ప్రయాణికులు, ప్రజలు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. కోర్టు ఎదురుగా వెళ్లే రోడ్డు మోకాటి లోతు గుంతలు ఉన్నాయంటూ ప్రయాణికులు గురువారం వాపోయారు. ఇది వరకే రోడ్లకు మరమ్మతులు చేయాలని పలుమార్లు అధికారులకు విన్నవించినా ఎవరు స్పందించడం లేదని వాపోయారు.