పుంగనూరు పట్టణంలోని ముడెప్ప సర్కిల్ వద్ద శనివారం రాత్రి 8 గంటల సమయంలో టీడీపీ సీనియర్ నాయకులు మధు రాయల్ నేతృత్వంలో అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదంలో మృతులైన వారికి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి స్టేట్ కౌన్సిల్ సభ్యుడు రాజా రెడ్డి సహా టిడిపి నాయకులు పలువురు పాల్గొన్నారు.