చిత్తూరు జిల్లా, పుంగనూరు మండల పరిధిలోని భీమ గాని పల్లి పెట్రోల్ బంక్ వద్ద ఆదివారం ద్విచక్ర వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి గాయపడ్డాడు. గాయపడ్డ వ్యక్తిని స్థానికులు హుటాహుటిన పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.