చిత్తూరు జిల్లా, పుంగనూరు పట్టణ పరిధిలోని నానాసాహెబ్ పేటకు చెందిన ఫారూఖ్ తన బుల్లెట్ వాహనాన్ని ఇంటిముందు మంగళవారం రాత్రి పార్క్ చేశారు. ఉదయం చూడగా ద్విచక్ర వాహనం కనబడకపోవడంతో చుట్టుపక్కల గాలించిన ఫలితం లేకపోవడంతో బుధవారం సాయంత్రం 6 గంటలకు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.