చిత్తూరు జిల్లా పుంగనూరు మండల పరిధిలోని ఉలవదిన్నె గ్రామ సమీపంలో విశ్వభారతి ప్రైవేట్ పాఠశాల బస్సు గురువారం ఉదయం బోడేవారి పల్లికి చెందిన నీలావతమ్మ, భార్గవి ద్విచక్ర వాహనంపై వస్తుండగా వారిని ఢీకొనడంతో ఇద్దరు గాయపడ్డారు. వారిని స్థానికులు హుటాహుటీన పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.