అనుమానాస్పద రీతిలో మహిళ మృతి చెందిన ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే పుంగనూరు పట్టణ పరిధిలోని ఆంజనేయ స్వామి గుడి వీధిలో కాపురం ఉంటున్న కమలమ్మ ఇంట్లో నుంచి దుర్గంధం రావడంతో స్థానికులు వెళ్లి చూశారు. కమలమ్మ అనుమానస్పద స్థితిలో మృతి చెంది ఉండడాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి పోలీసులు చేరుకున్నారు. వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది.