పుంగనూరు మండలం హనుమంతరాయలదిన్నెకు చెందిన రైతులు పొలంలో సోమవారం వేరుశనగ విత్తనాలు వేసుకుంటుండగా, పక్క పొలంలో 15 మంది యువకులు మద్యం సేవిస్తూ శల్యం చేస్తున్నారు. రైతు శివా వారిని అక్కడి నుంచి వెళ్లిపోవాలని కోరగా, యువకులు ఆయనపై మరియు భార్య కళ్యాణిపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.