చిత్తూరు జిల్లా, పుంగనూరు పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయాన్ని బుధవారం జడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక నాయకులతో పలు విషయాలను చర్చించారు. మండలంలోని రాజకీయ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అక్కిసాని భాస్కర్ రెడ్డి, నాయకులు కృష్ణమూర్తి, కొండవీటి నాగభూషణం, జిల్లా అధికారి రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.