పుంగునూరు మండలంలోని నల్లూరుపల్లి గ్రామ సమీపంలో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. అదే గ్రామానికి చెందిన జయరామిరెడ్డి రోడ్డుపై నడిచి వెళుతుండగా, అతివేగంగా వచ్చిన గుర్తు తెలియని వాహనం అతన్ని ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు 108కి సమాచారం ఇచ్చారు. పైలట్ రబ్బాని, ఎమర్జెన్సీ టెక్నీషియన్ నాగభూషణం అప్రమత్తమై, గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం పుంగునూరు ఏరియా హాస్పిటల్‌కు తరలించారు.