రొంపిచర్ల: కస్తూరిబా గాంధీ విద్యాలయాన్ని తనిఖీ చేసిన అధికారి

78చూసినవారు
రొంపిచర్ల: కస్తూరిబా గాంధీ విద్యాలయాన్ని తనిఖీ చేసిన అధికారి
పుంగనూరు నియోజకవర్గం,రొంపిచర్ల కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని జాయింట్ డైరెక్టర్ దేవరాజులు శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మెనూ ప్రకారం భోజనం అందుతుందా లేదా అనే విషయాన్ని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. స్టాక్ బుక్ ప్రకారం నిల్వలను తనిఖీ చేశారు. విద్యా ప్రమాణాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. జి సి డి వో ఇంద్రాణి, ఎంఈఓ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్