పుంగనూరు ఆర్టీసీ డిపో నందు బుధవారం ఆదర్శ ఉద్యోగుల అభినందన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా డీజిల్ పొదుపు చేసిన డ్రైవర్లు జయం భాష, పై రోజ్ భాష, దిలీప్ కుమార్ అదేవిధంగా అత్యంత ప్రతిభ చూపిన కండక్టర్లు అయినటువంటి ప్రియా, బాబు లను డిపో మేనేజర్ సుధాకరయ్య ఘనంగా సత్కరించారు. అనంతరం నగదు ప్రోత్సాహక బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సూపర్వైజర్ సంధ్య, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.