నగలు మాయం చేసిన కేటుగాళ్లు

84చూసినవారు
నగలు మాయం చేసిన కేటుగాళ్లు
ఆటోలో ప్రయాణిస్తున్న మహిళకు అపరిచితులు నగలు దోచుకున్న సంఘటన గురువారం చోటు చేసుకుంది. అత్తూరు పంచాయతీకి చెందిన బాధితురాలు, కార్వేటినగరంలో బంగారం విడిపించి రేణిగుంట చెక్‌పోస్టు చేరుకుని, ఆటోలో బంధువుల ఇంటికి వెళ్తుండగా గుర్తుతెలియని ఇద్దరు మహిళలు ఎక్కి, మార్గ మధ్యలో దిగిపోయారు. అనంతరం తన బ్యాగు పరిశీలించగా, నగలు మరియు డబ్బులు మాయమయ్యాయని గమనించి, రేణిగుంట పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సంబంధిత పోస్ట్