పుంగనూరు మండలం సింగిరిగుంట గ్రామంలో శుక్రవారం సాయంకాలం విషాదకర ఘటన చోటుచేసుకుంది. గ్రామ సమీపంలోని గుడి వద్ద ఆడుకుంటున్న 23 ఏళ్ల వినీత్ కుమార్‌ను పాము కాటేయడంతో అతడు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. కుటుంబ సభ్యులు వెంటనే పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ప్రాథమిక చికిత్స అనంతరం పరిస్థితి విషమంగా ఉందంటూ శివాడి ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి మరింత విషమంగా ఉందని సమాచారం.