చిత్తూరు జిల్లా, పుంగనూరు నియోజకవర్గం సోమల మండలం. వల్లిగట్ల పంచాయతీ. పుట్టా వారి పల్లి సమీపంలో గల వ్యవసాయ పొలం భూ వివాదంలో గత కొన్ని రోజులుగా దాయాదులు ఒకరిపై ఒకరు వాగ్వాదం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో బాధితుడు బాలాజీ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ గతంలో సోమల మండల తహసిల్దార్ గా విధులు నిర్వహించిన శ్యాంప్రసాద్ రెడ్డి, తదితరులు తమ సమీప బంధువుతో లాలూచీపడి పాస్ పుస్తకాలు తారుమారు చేశారని ఆరోపించారు.