చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలోని శ్రీ విరూపాక్షి మారెమ్మ అలంకరణ భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సందర్భంగా ఆషాడ మాసం చివరి శుక్రవారం అమ్మవారికి ఎంతో ముఖ్యమైన రోజు కావడంతో ఆలయ అర్చకులు ప్రత్యేక అలంకరణ చేశారు. అనంతరం పలు రకాల పుష్పాలు, దానిమ్మ, మొక్కజొన్న, కందిపప్పు, గాజులు, నిమ్మకాయలతో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. పెద్ద సంఖ్యలో మహిళలు ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.