పుంగనూరు నియోజకవర్గ సోమల సదుం రహదారిలో శనివారం సాయంకాలం సబ్ స్టేషన్ వద్ద మామిడి కాయలు తీసుకెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. ట్రాక్టర్‌లో లోడ్ అధికంగా ఉండటంతో ప్రమాదం జరిగింది. సంఘటన సమయంలో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. డ్రైవర్‌కు స్వల్ప గాయాలు కాగా, సదుం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులకు సమాచారం తెలిపారు.