మహిళల పట్ల అసభ్యకరంగా ప్రసారం చేసిన సాక్షి ఛానల్, సాక్షి పేపర్ ని బ్యాన్ చేయాలని మహిళలు డిమాండ్ చేశారు. పుంగనూరు నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు కవిత ఆధ్వర్యంలో సోమవారం పట్టణంలో మహిళలు నిరసన ర్యాలీ చేపట్టారు. ఇందిరా కూడలి నుండి MBT రోడ్డు గుండా అంబేద్కర్ సర్కిల్ వరకు ర్యాలీ కొనసాగించారు. అమరావతి మహిళలకు వైఎస్ భారతి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తర్వాత ఎమ్మార్వో రాముకు వినతి పత్రం అందజేశారు.