చిట్వేలు మండలంలోని మాంసం విక్రయదారులకు, మాంసాహారం విక్రయించు హోటళ్ల యజమానులు బుధవారము గాంధీ జయంతి సందర్భంగా జంతు మాంసంలను అమ్మరాదని చిట్వేలి మండల డిప్యూటీ తహసిల్దార్ మోహన కృష్ణ హెచ్చరించారు. మంగళవారం రెవెన్యూ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ నిబంధనలు అతిక్రమించిన ఎడల శాఖాపరమైన, చట్టపరమైన చర్యలు తీసుకొనబడునని హెచ్చరించారు.