సత్యవేడులో వైభవంగా గంగమ్మ తల్లి ఊరేగింపు

68చూసినవారు
సత్యవేడులో వైభవంగా గంగమ్మ తల్లి ఊరేగింపు
సత్యవేడులో బుధవారం శ్రీ గంగమ్మ తల్లి జాతర రాత్రి 9 గంటలకు ప్రారంభమైంది. గంగమ్మ తల్లిని వివిధ రకాల పుష్పాలతో సుందరంగా అలంకరించారు. ఆలయం వద్ద ప్రత్యేక పూజలు, కర్పూర హారతులు అందుకున్న అమ్మవారు గ్రామోత్సవంలో భక్తులకు దర్శనమిచ్చారు. మంగళ వాయిద్యాలు, డప్పుల మోతలు, వివిధ రకాల నృత్యాల మధ్య ఇంటింటా కర్పూర హారతులు అందుకుంటూ ఊరేగారు. భక్తులు భారీగా తరలివచ్చారు.

సంబంధిత పోస్ట్