నాగలాపురం మండలం అచ్చమనాయుడు కండ్రిగ వద్ద తిరుపతి-చెన్నై జాతీయ రహదారిపై బుధవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. చెన్నై నుంచి జిప్సం లారీ తాడిపత్రికి వెళుతూ ఎదురుగా ద్విచక్ర వాహనంలో వస్తున్న తమిళనాడు తిరువల్లూరుకు చెందిన అరవింద్ (28), నరసింహులు (26)ను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, 108 అంబులెన్స్ ద్వారా క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.