సత్యవేడు మండలం మదనంబేడు వద్ద బుధవారం బైకు అదుపు తప్పడంతో గుర్తు తెలియని వ్యక్తి కింద పడిపోయాడు. ఆయన తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు అంబులెన్ కు సమాచారం ఇచ్చారు. దీంతో వారిని సత్యవేడు ఏరియా ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డ వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనపై పోలీసులకు స్థానికుల సమాచారం అందజేశారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.