అన్ని దానాల్లోకి రక్తదానం మిన్న అని సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పేర్కొన్నారు. సోమవారం నాగాలాపురంలో జరిగిన అంబేడ్కర్ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. నాగలాపురం ప్రాథమిక పాఠశాల ఆవరణలో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. రక్తదానం చేసేందుకు ముందుకు వచ్చిన వారికి పండ్లు, జ్యూస్ పాకెట్లను ఎమ్మెల్యే పంపిణీ చేశారు.