సత్యవేడు నియోజకవర్గం బుచ్చినాయుడు కండ్రిగ మండలం పుతేరి గ్రామంలో శనివారం శ్రీకాళహస్తి భక్త కన్నప్ప కంటి వైద్యశాల త్రినేత్ర వైద్యరియ ట్రస్ట్ సహకారంతో కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరానికి విశేష స్పందన వచ్చింది. దాదాపు 100 మందికి పైగా శిబిరంలో పాల్గొని కంటి పరీక్షలు చేయించుకున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రామ్మూర్తి పాల్గొన్నారు.