తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం నాగలాపురం మండలం సురుటుపల్లి బైపాస్ రహదారి నిర్మాణ పనులు వేగంగా జరిగేలా చర్యలు తీసుకుంటామని జేసీ శుభం భన్సిల్ పేర్కొన్నారు. రహదారి ప్రాంతాన్ని ఆయన మంగళవారం ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంతో కలిసి సందర్శించారు. భూములు కోల్పోతున్న రైతుల వివరాలను ఎంఆర్ఓ హనుమాన్ నాయక్ ను అడిగి తెలుసుకున్నారు.