ఈ నెల 14న భారత రాజ్యాంగ నిర్మాత, డాక్టర్ బి. ఆర్. అంబేడ్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలని జడ్పీ ఫైనాన్స్ కమిటీ సభ్యులు కోనేటి సుమన్ కుమార్ పిలుపునిచ్చారు. ఉదయం 8 గంటలకు పుత్తూరులోని కార్వేటినగరం కూడలి వద్ద డాక్టర్ అంబేడ్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం నివాళి అర్పిస్తారన్నారు. 8.30 గంటలకు నారాయణవనం బైపాస్ కూడలి వద్దకు ఎమ్మెల్యే అంబేడ్కర్ జయంతి వేడుకల్లో పాల్గొంటారన్నారు.