నారాయణవనం టీటీడీ శ్రీ పద్మావతి దేవి సమేత శ్రీకళ్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం ఊంజల్ సేవ నిర్వహించారు. ఈ సందర్భంగా వేంకన్న స్వామి ఉత్సవమూర్తిని పంచతీర్థాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకించారు. పట్టువస్త్రాలు, బంగారు ఆభరణాలు, పలు రకాల పుష్పాలతో అలంకరించి ధూప దీప నైవేద్యాలు సమర్పించారు.