తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం వరదయ్యపాలెం మండలంలో బుధవారం ఉదయం ఓ మోస్తారు వర్షం కురిసింది. నిమిషాల్లోనే వాతావరణం మేఘావృతమై వర్షం మొదలైంది. రహదారులు జలమయం కాగా వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అధిక ఉష్ణోగ్రతల నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలు ఈ వర్షంతో కొంత ఊరట చెందారు.