సత్యవేడు నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తానని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం స్పష్టం చేశారు. కేవీబీపురంలోని కేజీబీవీ జూనియర్ కళాశాలలో సర్వశిక్ష అభియాన్ నిధులు రూ. 1.27 కోట్లతో అదనపు తరగతి గదుల నిర్మాణానికి బుధవారం ఎమ్మెల్యే భూమిపూజ చేశారు. నిధులు మంజూరు చేసిన మంత్రి నారా లోకేశ్కు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు.