ఓ చోరీ కేసులో నిందితుడిని నాగలాపురం పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. మండలంలోని బయట కొడియంబేడుకు చెందిన సలీం(20) సుబ్బానాయుడు కండ్రిగ వద్ద 2024 మే 25న కర్నూలు వెళ్తున్న బస్సులో ఓ విద్యార్థి నుంచి రూ. 1.9 లక్షల విలువైన లాప్ టాప్, రూ.25 వేల విలువైన ఇయర్ ఫోన్ అపహరించాడు. నాగలాపురం ఎస్ఐ సునీల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని అరెస్టు చేశామని ఎస్ఐ సునీల్ తెలిపారు.