తమిళనాడు రాజధాని చెన్నైకి తెలుగు గంగ కాలువ ద్వారా నీటిని విడుదల చేసిన ఘనత తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు కే దక్కుతుందని సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కొనియాడారు. శనివారం ఊత్తుకోట సమీపంలో ఉన్న తెలుగు గంగ జీరో పాయింట్ ను ఎమ్మెల్యే, తెలుగు గంగ చీఫ్ ఇంజనీర్ ఎం. ఎల్. ఎన్ వరప్రసాద్ తో కలిసి పరిశీలించారు.