సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం, తెలుగు గంగ చీఫ్ ఇంజనీర్ ఎం. ఎల్. ఎన్ వర ప్రసాద్ దంపతులు శనివారం నాగలాపురం మండలం సురుటపల్లి శ్రీ పల్లికొండేశ్వర స్వామిని దర్శించుకొన్నారు. ఈ సందర్భంగా ఆలయ ఈఓ లత ఎమ్మెల్యే, చీఫ్ ఇంజనీర్ దంపతులకు స్వామివారి చిత్ర పటం అందించారు. ఆలయ ప్రధాన అర్చకులు కార్తికేయ గురుక్కల్ తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వచనాలు పలికారు.