నాగలాపురం: వారపు సంతలో ప్రజల అవస్థలు

78చూసినవారు
నాగలాపురంలో ప్రతి బుధవారం వారపు సంత జరుగుతోంది. పిచ్చాటూరు, నాగలాపురం మండలాల నుంచి ప్రజలు వారపు సంతకు వచ్చి వారికి కావలసిన నిత్యవసర సరుకులను కొనుగోలు చేస్తారు. ఇన్నాళ్లు సంత జరుగుతున్న స్థలాన్ని ఇరుకైన రోడ్డులోకి మార్చడంతో విక్రయదారులతోపాటు కొనుగోలుదారుల సైతం అవస్థలు పడుతున్నట్లు తెలిపారు. ధర్మరాజు స్వామి ఆలయం వద్ద ఉన్న సంతను ఆలయంలో కుంభాభిషేకం జరుగనున్న సందర్భంగా నిర్వాహకులు సంతను తరలించారు.

సంబంధిత పోస్ట్