నాగలాపురం: కదలని కాల చక్రం

64చూసినవారు
నాగలాపురంలోని శ్రీ వేదనారాయణ స్వామి ఆలయం ఉన్న సన్నిధి వీధిలో, గ్రామ చావడి ఎదుట దశాబ్దాల క్రితం ఓ టవర్ క్లాక్ నిర్మించారు. ఈ టవర్ క్లాక్ కూలి పనులకు వెళ్లే ప్రజలకు, ప్రయాణికులకు చాలా ఉపయోగకరంగా ఉండేది. కాలక్రమేణా ఆ స్థలం టవర్ క్లాక్ కూడలిగా ప్రసిద్ధి చెందింది. టవర్ క్లాక్ కు నలువైపులా గడియారం అమర్చి ఉంది. శిథిలావస్థలో ఉన్న టవర్ క్లాక్ ను బాగు చేయించాలని పంచాయతీ అధికారులను గురువారం ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్