నగరి పట్టణంలో, తమిళ పండగను పునస్కరించుకుని సోమవారం మధ్యాహ్నం అయ్యప్ప స్వామికి ప్రత్యేక అభిషేకము నిర్వహించారు. అనంతరం స్వామివారిని విధి విధి పుష్పాలతో అలంకరణ చేశారు. ఆలయ ధర్మకర్త, స్వామికి నైవేద్యము సమర్పించి దీప దూప నైవేద్యం అందజేశారు. గురువులైన లోకేష్ దాస్ శివకుమార్ దాస్ తులసీదాస్ భక్త బృందముతో కోడి భజనలు నిర్వహించారు. పట్టణ భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు.