సత్యవేడు నియోజకవర్గం నారాయణవనం మండలం అరణ్యం కండ్రిగ జిల్లా పరిషత్ హైస్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతున్న వసు అనే విద్యార్థిని జాతీయస్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపికైంది. ఇటీవల విజయనగరం జిల్లా భోగాపురం ఉన్నత పాఠశాలలో జరిగిన వాలీబాల్ పోటీలలో ప్రత్యేక ప్రతిభ కనబరిచింది. ఈ సందర్భంగా గురువారం ఉపాధ్యాయులు ఆమెకు రూ. 10 వేల ఆర్థిక సహాయం అందజేశారు.