ప్రజలను సకాలంలో గమ్య స్థానాలకు చేర్చడంలో ఆర్టీసీ సేవలు అద్వితీయమని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కొనియాడారు. సోమవారం ఆయన సత్యవేడు-బెంగళూరుకు నూతన బస్సు సర్వీసులను ప్రారంభించారు. మారుమూల పల్లెలకు సైతం ఆర్టీసీ సేవలను విస్తరించిన ఘనత దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావుకే దక్కుతుందని కొనియాడారు. ప్రతి ఒక్కరూ ఈ సేవలను ఉపయోగించుకోవాలని కోరారు.