రైతులు ఈనెల 20వ తేదీలోపు వేలిముద్రలు వేసి ఈకేవైసీ చేయించుకుంటేనే అన్నదాత సుఖీభవ నగదు జమ అవుతుందని శుక్రవారం సత్యవేడు వ్యవసాయ అధికారి మురళి చెప్పారు. మండలంలో 3, 485 మంది రైతులను ఈ పథకానికి అర్హులుగా గుర్తించామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూ. 14 వేలు, కేంద్ర ప్రభుత్వం రూ. 6 వేలు ఇస్తుందన్నారు.