ఎస్. సి. కార్పొరేషన్ ద్వారా సబ్సీడీ రుణాల కోసం అర్హులైనవారు ఆన్లైన్లో ధరఖాస్తు చేసుకోవాలని నాగలాపురం ఎంపీడీఓ బాలాజి నాయక్ తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ 21-50 ఏళ్ల ఎస్. సి, ఎస్. టి వర్గాలకు చెందిన వారు ఎస్. సి. కార్పొరేషన్లో రుణాలను పొందవచ్చన్నారు. ఈ ధరఖాస్తు గత నెల 14వ తేది ప్రారంభమైందని, మే నెల 10వ తేదిలోపు ధరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.