సత్యవేడు నియోజకవర్గం కేవీబీపురం పోలీస్ స్టేషన్ను నారాయణవనం రూరల్ సీఐ రవీంద్ర ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎఫ్ఎఆర్, ఇండెక్స్, ఎంసీఆర్, జీడీ సెంట్రల్, విజిట్, సస్పెక్టెడ్ రికార్డులు పరిశీలించారు. నేరచరిత్ర కలిగిన వారిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఎస్ఐ నరేశ్ కు సూచించారు. చట్ట వ్యతిరేక కార్యాకలాపాలు నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.