పిచ్చాటూరు మండలం సిద్ది రాజు కండ్రిగలో కొలువైన శ్రీ గౌరీ సమేత శ్రీ సోమనాధేశ్వర స్వామి వారి ఆలయంలో గురువారం ప్రదోష పూజలు జరుగుతాయని ఆలయ ధర్మకర్త జ్యోతి రాజు తెలిపారు. గురువారం సాయంత్రం నాలుగు గంటల నుంచి 6 గంటల వరకు ఆలయంలోని ఆస్థాన నందీశ్వరునికి విశేష అభిషేకాలు, ప్రత్యేక పుష్పాలంకరణ, అనంతరం మహా హారతి కార్యక్రమాలు జరుగుతాయన్నారు. భక్తులు పాల్గొని స్వామి అనుగ్రహం పొందాలని బుధవారం కోరారు.