సత్యవేడు నియోజకవర్గం పిచ్చాటూరు అరణీయార్ వద్ద నిర్మాణంలో ఉన్న వ్యూ టవర్ను మంగళవారం జేసీ శుభం బన్సల్ ఎమ్మెల్యే ఆదిమూలంతో కలిసి పరిశీలించారు. పర్యాటక అభివృద్ధి పనులకు రూ. 40 లక్షలు విడుదల చేయాలని జేసీని కోరినట్లు ఆదిమమూతం తెలిపారు. అదే విధంగా ఏస్ఏస్బీ పేటలో ఉన్న ప్రభుత్వ భూమిని స్థానిక పేదలకు పంపిణీ చేయాలని కోరామన్నారు. కీలపూడికి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా సాగునీరు అందించాలని ఆయన కోరారు.