సత్యవేడు నియోజకవర్గం పిచ్చాటూరు మండలం కీలపూడికి చెందిన వైసీపీ కీలక నేత పాలు పద్మనాభం మంగళవారం బీసీ ఉద్యమ నేత, బీజేపీ రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్యను మర్యాదపూర్వకంగా కలిశారు. పద్మనాభం గతంలో పిచ్చాటూరు మండల వైస్ ఎంపీపీగా, ఆయన సతీమణి సునంద నాగలాపురం ఏఎంపీ ఛైర్మన్ గా పనిచేశారు. త్వరలో పద్మనాభం బీజేపీలో చేరనున్నట్లు స్థానికంగా ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో వారి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.