సత్యవేడు నియోజకవర్గం పిచ్చాటూరు మండలంలో అరణియార్ వరద నీరు కారణంగా అరుణానది ఉద్ధృతంగా ప్రవహించింది. ఈ సందర్భంగా కరూర్ వద్ద రోడ్డు నీటి ధాటికి కొట్టుకుపోయింది. మండల వ్యాప్తంగా వాగులు, వంకలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. చెరువులు నిండుకుండలా మారాయి. అప్రమత్తంగా ఉండాలని శుక్రవారం అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.