పిచ్చాటూరు మండలం, సిద్దిరాజుల కండ్రిగ గ్రామంలో కొలువై ఉన్న శ్రీ గౌరీ సమేత సోమనాధేశ్వర స్వామి దేవాలయములో మంగళవారం రాత్రి పౌర్ణమి పూజ వేడుకగా ఘనంగా నిర్వహించారు, ఆలయ ప్రధాన అర్చకుడు నవీన్ శర్మ, దేవతామూర్తులకు అభిషేకం నిర్వహించారు. అనంతరం వివిధ పుష్పాలతో అలంకరణ చేసి, పంచ హారతులను అందజేశారు. స్వామివారిని దర్శించుకోవడానికి గ్రామ ప్రజలు ఆలయానికి చేరుకున్నారు.