తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం వరదయ్యపాలెం మండలం నాగనందాపురంలో మంగళవారం మహిళలు, గ్రామ ప్రజలు గంగమ్మ ఆలయం వద్దకు ఊరేగింపుగా వెళ్లి అంబళ్లు పోశారు. అనంతరం అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. గ్రామంలోని అన్ని కుటుంబాల ప్రజలు చల్లగా ఉండాలని కోరుకున్నట్లు స్థానికులు తెలిపారు.