పెన్షన్ల పంపిణీపై సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం శనివారం కీలక సూచనలు చేశారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో టీడీపీ నాయకులు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులతో కలసి ఇంటింటికి వెళ్లి పెన్షన్లను పంపిణీ చేయాలని ఎమ్మెల్యే కోరారు. సత్యవేడు మండలం మదనంబేడు గ్రామంలో సోమవారం ఉదయం ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం చేతుల మీదుగా పెంచిన పెన్షన్ డబ్బులు పంపిణీ ప్రారంభిస్తారు.