సత్యవేడు మండలంలోని వీఆర్ కండ్రిగ - టిపి పాలెం రోడ్డుకు మరమ్మతులు చేయాలని స్థానిక టీడీపీ నాయకులు తెలిపారు. ఆదివారం వారు మాట్లాడుతూ. రెండు నెలల క్రితం మరమ్మతుల పేరుతో జేసీబీతో రోడ్డును సర్వ నాశనం చేశారని చెప్పారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి వెంటనే రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని కోరారు.