పిచ్చాటూరు మండలంలోని రేషన్ షాపు డీలర్లతో ఎంఆర్ఓ వై. రమేశ్ బాబు శుక్రవారం సమీక్ష నిర్వహించారు. రేషన్ డీలర్లకు ఏవైనా సమస్యలు ఉంటే తెలియజేయాలన్నారు. ప్రభుత్వం డీలర్లకు అందిస్తున్న నిత్యవసర వస్తువులను నిర్ణీత కాలవ్యవధిలోపు లబ్ధిదారులకు పంపిణీ చేయాలన్నారు. రేషన్ డీలర్లు అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.